Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

పరమగీతము1

Son 1:1  సొలొమోను రచించిన పరమగీతము. 
Son 1:2  నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము. 
Son 1:3  నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు. 
Son 1:4  నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించె దము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చున్నారు. 
Son 1:5  యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను 
Son 1:6  నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. 
Son 1:7  నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను? 
Son 1:8  నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము. 
Son 1:9  నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. 
Son 1:10  ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. 
Son 1:11  వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము 
Son 1:12  రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను. 
Son 1:13  నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు 
Son 1:14  నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. 
Son 1:15  నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు. 
Son 1:16  నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు మన శయనస్థానము పచ్చనిచోటు 
Son 1:17  మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు. 

No comments:

Post a Comment