Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

పరమగీతము7

Son 7:1  రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి. 
Son 7:2  నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి 
Son 7:3  నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి. 
Son 7:4  నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. 
Son 7:5  నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు. 
Son 7:6  నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో నీవు అతిసుందరమైనదానవు అతి మనోహరమైనదానవు. 
Son 7:7  నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. 
Son 7:8  తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది. 
Son 7:9  నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును. 
Son 7:10  నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు. 
Son 7:11  నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము. 
Son 7:12  పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను 
Son 7:13  పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి. 

No comments:

Post a Comment